Adobe career: అడోబ్​ కేరీర్​ అద్భుతం..

adobe career opportunities 2025

ప్రపంచంలో అత్యధికమందిని ఆకట్టుకుంటున్న రంగం ఎంటర్‍టైన్‍మెంట్‍ అండ్‍ మీడియా. ఎంటర్‍టైన్‍మెంట్‍ మనసుకు ఉల్లాసాన్నిస్తే.. మీడియా మెదడుకి సమాచారం అందిస్తుంది. ఈ రోజుల్లో కంటెంట్‍ ఎంత ముఖ్యమో దాని ప్రజెంటేషన్‍ కూడా అంతే ముఖ్యం. కాబట్టి రంగు రంగుల డిజైన్లు, ఆకట్టుకునే గ్రాఫిక్స్‌తో పాఠకులు, వీక్షకులను రంజింప చేయాలంటే క్రియేటివ్‍ సాఫ్ట్‌వేర్లపై ఆధారపడవలసిందే. గ్రాఫిక్‍ డిజైన్‍, యానిమేషన్‍, ఎడిటింగ్‍, మిక్సింగ్‍, డెస్క్ టాప్‍ పబ్లిషింగ్‍కు పదుల సంఖ్యలో అప్లికేషన్లు అందుబాటులో ఉన్నా ప్రపంచవ్యాప్తంగా అత్యధికులు వినియోగిస్తున్నది అడోబ్‍ adobe software సాఫ్ట్‌వేర్లనే. ఫలితంగా అడోబ్‍ క్రియేటివ్‍ అండ్‍ డిజైన్‍ అప్లికేషన్లలో ఎక్స్‌పర్టైజ్‍ సాధించిన వారికి డిమాండ్‍ గణనీయంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అడోబ్‍ ప్యాకేజెస్‍ లెర్నర్స్‌కి అందుబాటులో ఉండే ఉద్యోగావకాశాలు ఏంటి? టాప్‍ రిక్రూటర్స్ ఎవరు? ట్రైనింగ్‍ ఎలా తీసుకోవాలనే వాటిపై పూర్తివివరాలు…

ఒకప్పుడు సినిమాలు, మీడియా కోసం బ్లాక్ అండ్‍ వైట్‍ పేపర్లు, స్ర్కీన్లపైనే ఆధారపడవలసి వచ్చేది. ప్రస్తుత కాలంలో  డిజిటల్‍ టెక్నాలజీ గణనీయంగా విస్తరించి అరచేతిలో ఇమిడిపోతుంది. అందుకే పుస్తకాలు, సినిమా, రేడియో, న్యూస్‍ పేపర్లు, టెలివిజన్లు, వెబ్‍సైట్స్, యాప్స్ ఇలా చానల్‍ ఏదైనా కంటెంట్‍ ప్రజెంటేషన్‍కు ప్రాధాన్యత ఇస్తున్నారు. మెదడులో వచ్చిన ఆలోచనకు చక్కని రూపం ఇచ్చేందుకు, సృజనాత్మకతను ఇనుమడింప చేయడానికి క్రియేటివ్‍ పర్సన్స్, సాఫ్ట్‌వేర్లే ప్రధాన ఆధారం. ఫలితంగానే డిజైనర్లు, ఎడిటర్లు, యానిమేటర్స్ కు ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తున్నాయి. .

ఏ అప్లికేషన్‍ ఎందుకు?

గ్రాఫిక్‍ డిజైన్‍ & పబ్లిషింగ్‍

అడోబ్‍ ఫోటోషాప్‍, పేజ్‍మేకర్‍, ఇన్‍డిజైన్‍, ఇన్‍కాపీ, ఇమేజ్‍ రెడీ ఇల్యూస్ర్టేటర్‍, ఫ్రేమ్‍మేకర్‍, ఆక్రోబాట్‍ వంటివి గ్రాఫిక్‍ డిజైన్‍ అండ్‍ డెస్క్‌టాప్‍ పబ్లిషింగ్‍ సాఫ్ట్‌వేర్‍లు. ఇందులో ఫోటోషాప్‍, ఇల్యూస్ర్టేటర్‍ ద్వారా ఫోటోల కరెక్షన్‍, ఎడిటింగ్‍, గ్రాఫిక్స్ మేకింగ్‍, 3డీ ఆర్ట్ వర్క్ వంటివి చేయవచ్చు. వెక్టార్స్ డిజైన్‍ చేయడానికి ఇల్యూస్ర్టేటర్‍, జిఫ్‍ ఇమేజ్‍లు చేయడానికి ఇమేజ్‍ రెడీ ఉపయోగిస్తారు. పేజ్‍మేకర్‍, ఇన్‍డిజైన్‍ అనేవి డీటీపీ సాఫ్ట్‌వేర్లు. వీటి ద్వారా పుస్తకాలు, న్యూస్‍ పేపర్లు, మేగజీన్లు, పాంప్లెట్స్, బ్రోచర్స్, కేటలాగ్స్ వంటివి డిజైన్‍ చేసి ప్రింట్‍ చేస్తారు. టెక్స్ట్ ఎడిట్‍, లే అవుట్‍ మోడిఫికేషన్స్, వర్డ్ ప్రాసెసింగ్‍ వంటి వాటి కోసం ఇన్‍ కాపీ ఉపయోగపడుతుంది. పెద్ద పెద్ద డాక్యుమెంట్లు, స్ర్టక్చర్డ్ డాక్యుమెంట్లు ఎడిట్‍ చేయడానికి ఫ్రేమ్‍ మేకర్‍ వినియోగిస్తారు.

వీడియో ఎడిటింగ్‍ & విజువల్‍ ఎఫెక్స్ట్ video editing and visual effects

అడోబ్‍ అల్ర్టా, స్పార్క్ వీడియో, ప్రీమియర్‍ ప్రో, ప్రీమియర్‍ ఎలిమెంట్స్, డైరెక్టర్, యానిమేట్‍, ఆఫ్టర్‍ ఎఫెక్ట్స్, క్యారెక్టర్‍ యానిమేట్‍ వంటి అప్లికేషన్లను వీడియో ఎడిటింగ్‍, యానిమేషన్‍ మేకింగ్‍, విజువల్‍ ఎఫెక్ట్స్ కోసం ఉపయోగిస్తారు. ఇందులో ప్రీమియర్‍ ప్రో సాఫ్ట్‌వేర్‍ ముఖ్యమైనది. దీని ద్వారా వీడియో ఎడిటింగ్‍, మిక్సింగ్‍ చేయవచ్చు. అనంతరం ఆఫ్టర్‍ ఎఫెక్ట్స్ ఉపయోగించి ఫిల్మ్, టెలివిజన్‍ ప్రొడక్షన్‍లో విజువల్‍ ఎఫెక్ట్స్, మోషన్‍ గ్రాఫిక్స్ వంటి పోస్ట్ ప్రొడక్షన్‍ వర్క్ చేయవచ్చు. యానిమేట్‍, క్యారెక్టర్‍ యానిమేట్‍ ద్వారా 2డీ, 3డీ యానిమేషన్‍ క్యారెక్టర్లు, వీడియోలు సృష్టించవచ్చు. స్పార్క్ వీడియో అనేది ఐపాడ్‍, ఐఫోన్‍ కోసం ప్రత్యేకంగా రూపొందించిన స్టోరీ టెల్లింగ్‍ అండ్‍ యానిమేటెడ్‍ వీడియో అప్లికేషన్‍.

వెబ్‍ డిజైన్‍ ప్రోగ్రామ్స్ web design

అడోబ్‍ మ్యూస్, గో లైవ్‍, ఫ్లాష్‍ బిల్డర్‍, ఫ్లాష్‍ ఎడ్జ్, డ్రీమ్‍ వీవర్‍, యానిమేట్‍ వంటి సాఫ్ట్‌వేర్‍లు వెబ్‍ డిజైన్‍కు ఉపయోగిస్తారు. ఇందులో ఆడోబ్ మ్యూస్‍ వాడి కోడింగ్‍ రాయనవసరం లేకుండానే అద్భుతమైన వెబ్‍సైట్లు రూపొందించవచ్చు. గో లైవ్‍ అనేది హెచ్‍టీఎంఎల్‍ అండ్‍ వెబ్‍సైట్‍ మేనేజ్‍మెంట్‍ సాఫ్ట్‌వేర్‍.  ఫ్లాష్‍ ఉపయోగించి ఫ్లాష్ వెబ్‍పేజీలు డిజైన్‍ చేస్తారు. డ్రీమ్‍ వీవర్‍ అనేది వెబ్‍ డిజైన్‍ అండ్‍ డెవలప్‍మెంట్‍ అప్లికేషన్‍.

వీటితో పాటు పీడీఎఫ్‍ల తయారీ, ఎడిటింగ్‍ అండ్‍ డిజైన్‍ చేయడం కోసం ఆక్రోబాట్‍ ప్రో అండ్‍ అడోబ్‍ డీసీ ఎంతగానో ఉపయోగపడతాయి. సౌండ్‍ ఎడిటింగ్‍ అండ్‍ మిక్సింగ్‍కు అడోబ్‍ సౌండ్‍బూత్‍, ఆడిషన్‍ అప్లికేషన్లు వాడుతారు. వీడియోలు, యానిమేషన్, పీడీఎఫ్‍లు, పీపీటీలు వంటి ఈ లెర్నింగ్‍ మెటీరియల్స్‌లో గ్రాఫిక్స్, యానిమేషన్‍ ను ఇన్‍సర్ట్ చేయడానికి అడోబ్‍ క్యాప్టివేట్‍ ఫీచర్స్ అద్భుతంగా పనిచేస్తాయి. కోల్డ్ ఫ్యుజన్‍ అనేది సర్వర్‍ సాఫ్ట్‌వేర్‍. డిజిటల్‍ మార్కెటింగ్‍ కోసం అడోబ్‍ మార్కెటింగ్‍ క్లౌడ్‍ మరియు ఎక్స్‌పీరియన్స్ అనే అప్లికేషన్లు ఉపయోగిస్తారు. అడోబ్‍ సాఫ్ట్‌వేర్లన్నీ ఒకదానితో ఒకటి ఇంటర్‍ లింక్డ్ అయి ఉంటాయి. అంటే కొన్నిసార్లు ఒక అప్లకేషన్‍లో మరో అప్లికేషన్‍ ఉపయోగించాల్సి వస్తుంది. ఉదాహరణకు ఫోటోషాప్‍లో ఎడిట్‍ చేసిన ఇమేజెస్‍తో ఇమేజ్‍రెడీ ఉపయోగించి జిఫ్‍ ఫైల్స్ తయారు చేయవచ్చు. కాబట్టి కనీసం 5–8 అప్లికేషన్లను పూర్తిగా నేర్చుకోగలిగితే మిగిలిన అన్ని అడోబ్‍ సాఫ్ట్‌వేర్లను ఆపరేట్‍ చేసే స్కిల్‍ మీ సొంతం అవుతుంది.

జాబ్‍ అపర్చునిటీస్‍ jobs in adobe career

ప్రపంచవ్యాప్తంగా ఎంటర్‍టైన్‍మెంట్‍ అండ్‍ మీడియా ఇండస్ర్టీ గణనీయంగా విస్తరిస్తుండటంతో ఈ రంగంలో డిజైనర్లకు పుష్కలమైన అవకాశాలు లభిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫిల్మ్ అండ్‍ మోడలింగ్‍ ఇండస్ర్టీ, ప్రింట్‍ మీడియా, ఎలక్ర్టానిక్‍ మీడియా, వెబ్‍ మీడియా, యానిమేషన్‍ కంపెనీలు, డిజైన్‍ అండ్‍ పబ్లికేషన్ సంస్థలు, యాడ్‍ ఏజెన్సీలు, వీడియో క్రియేషన్స్, రేడియో అండ్‍ ఎఫ్‍ఎం, మార్కెటింగ్‍ కన్సల్టెంట్‍ సంస్థల్లో 70 శాతం కంపెనీలు అడోబ్‍ అప్లికేషన్స్, ప్రోడక్ట్స్‌నే వినియోగిస్తుంటాయి. ఈ రంగంలో గ్రాఫిక్‍ డిజైనర్‍, వీడియో ఎడిటర్‍, ఫోటో ఎడిటర్‍, యానిమేటర్‍, సౌండ్‍ టెక్నీషియన్‍, ఆర్టిస్ట్, వెబ్‍ డిజైనర్‍, వెబ్‍ డెవలపర్‍ వంటి జాబ్‍ ప్రొఫైల్స్ ఉంటాయి. వీరు కంటెంట్‍, ఆడియో, వీడియో, యానిమేషన్‍ ప్రొడక్షన్‍ చేస్తారు. ప్రింట్‍ మీడియాలో స్టిల్‍ గ్రాఫిక్స్, ఇన్‍ఫోగ్రాఫిక్స్, ఫోటో ఎడిటింగ్, పేజ్‍ డిజైనింగ్‍ (పేజ్‍నేషన్‍) వంటి వర్క్స్ ఉంటాయి. ఎలక్ర్టానిక్‍ మీడియాలో ఆడియో, వీడియో ఎడిటింగ్‍, మిక్సింగ్‍, విజువల్‍ ఎఫ్టెక్ట్స్, ప్రోగ్రామింగ్‍, యానిమేషన్‍ వంటి టాస్క్స్ పర్‍ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. వెబ్‍ మీడియా లేదా డిజిటల్‍ మీడియాలో ప్రింట్‍ & ఎలక్ర్టానిక్‍ మీడియాలో చేసే అన్ని పనులు చేయవచ్చు. ఇక వెబ్‍ డెవలప్‍మెంట్‍, కంటెంట్‍ ప్రజెంటేషన్‍ అనేవి అదనం. ఏ మీడియా చూసినా క్రియేటివ్‍ ఫీల్డే కాబట్టి ఇందులో రాణించాలంటే కావాల్సింది సృజనాత్మకత, ఊహాశక్తి. అడోబ్‍ ప్యాకేజెస్‍, అప్లికేషన్లపై పూర్తి పట్టు సాధించిన వారికి ప్రారంభంలోనే నెలకు 20 వేలకు పైగా వేతనం లభిస్తుంది. అనుభవం, పని సామర్థ్యం ఆధారంగా అనతి కాలంలోనే లక్షల్లో జీతాలు పొందొచ్చు. ఈ ఫీల్డ్ కు భాషతో పెద్దగా పని ఉండదు. ఇంగ్లిష్‍ పై కొంచెం పట్టు సాధిస్తే సరిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా రాణించేందుకు అవకాశం ఉండే జాబ్స్ ఇవి.

ఎలా  నేర్చుకోవాలి?

అడోబ్‍ ఈ లెర్నింగ్‍ ప్లాట్‍ఫాం ద్వారా ఎప్పుడైనా ఎక్కడైనా ఏ అప్లికేషన్‍ అయినా నేర్చుకొని సాధన చేయవచ్చు. ఇందుకు కొంత వరకు ఖర్చవుతుంది. ఎక్స్‌పర్ట్స్ ఆన్‍లైన్‍లో ట్రైనింగ్‍ ఇస్తారు. కోర్సుకు సంబంధించి వీడియో లెక్చర్స్, లెసన్స్, మాడ్యూల్స్ ఉంటాయి.  ఇంటరాక్టివ్‍ లెర్నింగ్‍ అంటే.. డెమో లెసన్స్ చూస్తూ, అప్లికేషన్ ను ఆన్‍లైన్లోనే ఉపయోగిస్తూ ప్రాక్టీస్‍ చేయవచ్చు. ప్రాక్టీస్‍కే ఎక్కువ సమయం కేటాయించి నేర్చుకోవాల్సి ఉంటుంది. అసైన్‍మెంట్స్ పూర్తి చేయాలి. వర్క్, క్రియేటివిటీని అంచనా వేసి గ్రేడింగ్‍ ఇస్తారు. మీ సాధనను అంచనా వేసుకోవడానికి క్విజ్‍లు నిర్వహిస్తారు. దీంతో పాటు ఆన్‍లైన్‍ కోర్సులు అందిస్తున్న మూక్స్ వెబ్‍సైట్స్ నుంచీ ఉచితంగా ఎడిటింగ్‍, యానిమేషన్‍, గ్రాఫిక్‍ డిజైన్‍, పబ్లిషింగ్‍ వంటి కోర్సులను చేయవచ్చు. అలాగే లోకల్‍ ట్యూటర్స్, ఎక్స్‌పర్ట్స్, ఇన్‍స్టిట్యూట్స్ కూడా ట్రైనింగ్‍ ప్రొవైడ్‍ చేస్తాయి. ఇవేవి కుదరదనుకుంటే ఏ సాఫ్ట్‌వేర్‍ ఎలా నేర్చుకోవాలో చెబుతో యూట్యూబ్‍లో నిపుణులు అప్‍లోడ్‍ చేసిన వేల వీడియోలు చూసి సొంతంగానే సాధన చేయవచ్చు. చాలా కంపెనీలు సైతం ఈ లెర్నింగ్‍ కోర్సులను గుర్తించి ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. డెస్క్‌టాప్‍, ల్యాప్‍టాప్‍, ట్యాబ్లెట్‍ లేదా మొబైల్‍ డివైజెస్‍లోనూ వీటిని నేర్చుకోవచ్చు. అడోబ్‍ ప్యాకేజెస్ రన్‍ కావాలంటే హై కంపాటబిలిటీ కలిగిన ప్రాసెసర్‍, ర్యామ్‍, రోమ్‍, స్టోరేజ్‍ ఫీచర్స్ ఉండాలి. 

అడోబ్‍ ఇంక్‍ adobe ink

అడోబ్‍గా అందరికి సుపరిచితమైన సాఫ్ట్‌వేర్‍ కంపెనీ ఇది. మల్టీ మీడియా, క్రియేటివ్‍ సాఫ్ట్‌వేర్స్‌ను తయారు చేస్తుంది. దీనిని 1982లో జాన్‍ వార్నాక్‍ (John Warnock) ఏర్పాటు చేశారు.  అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ర్టంలో తన ఇంటి వెనుక పారే చిన్న కాలువ లేదా సెలయేరు అయిన ‘అడోబ్‍ క్రీక్‍’ పేరునే ఈ కంపెనీకి పెట్టారు వార్నాక్‍. మొదట డిజిటల్‍ ఫాంట్స్ తయారు చేసిన ఈ సంస్థ ఆ తర్వాత వెక్టార్స్ గీసే డ్రాయింగ్‍ సాఫ్ట్‌వేర్‍ అయిన ఇల్లుస్ర్టేటర్‍ను రూపొందించింది. 1989లో అడోబ్‍లో అత్యంత పాపులరైన ఫోటోషాప్‍ను తెచ్చింది. అనంతరం పీడీఎఫ్‍ డాక్యుమెంట్స్ సాఫ్ట్‌వేర్‍ ఆక్రోబాట్‍ అండ్‍ రీడర్‍, అడోబ్‍ ప్రీమియర్‍ ప్రో, పేజ్ మేకర్‍, ఆఫ్టర్‍ ఎఫెక్ట్స్, క్యాప్టివేట్‍, డ్రీమ్‍వీవర్‍, ఫ్లాష్ ప్లేయర్‍, ఇన్‍డిజైన్‍, క్యారెక్టర్‍ ఆనిమేటర్ వంటి దాదాపు 60 కి పైగా క్రియేటివ్‍ సాఫ్ట్‌వేర్లను మార్కెట్లో విడుదల చేసింది. క్రియేటివ్‍  క్లౌడ్‍ అనేది అడోబ్‍ ఆన్‍లైన్‍ లో అందిస్తున్న సాఫ్ట్‌వేర్ల సమాహారం. భారతీయ అమెరికన్‍ శాంతను నారాయణ్‍ ఈ కంపెనీకి ప్రస్తుత చైర్మన్‍ అండ్‍ సీఈవో. ఫోటోషాప్‍ రూపకల్పనలో ఈయన కీలక పాత్ర పోషించారు. 

వెబ్‍సైట్‍: www.adobe.com

అడోబ్‍ ప్రోడక్ట్స్ జాబితా

Graphic Design Software: Adobe Photoshop, Pagemaker, Lightroom, InDesign, InCopy, ImageReady,  Illustrator, Freehand, FrameMaker, Fireworks, Acrobat, XD etc.

Web Design Programs: Adobe Muse, GoLive, Flash Builder, Flash, Edge, Dreamweaver, Contribute

Video Editing, Animation and Visual Effects: Adobe Ultra, Spark Video, Premiere Pro, Premiere Elements, Prelude, Encore, Director, Animate, After Effects,  Character Animator

Audio editing Software: Adobe Soundbooth, Audition

eLearning Software: Adobe Captivate Prime (LMS platform), Captivate, Presenter Video Express and Connect (also a webconferencing platform)

Digital Marketing Management Software: Adobe Marketing Cloud, Experience Manager (AEM 6.2), XML Documentation add-on (for AEM), Mixamo,

Server Software: Adobe ColdFusion, Content Server and LiveCycle Enterprise Suite, BlazeDS

Formats: Portable Document Format (PDF), PDF’s Predecessor PostScript, ActionScript, Shockwave Flash (SWF), Flash Video (FLV), and Filmstrip (.flm) 

Web-Hosted Services: Adobe Color, Photoshop Express, Acrobat.com, and Adobe Spark

Leave a Comment