aerospace engineering: ఏరోస్పేస్​ ఇంజినీరింగ్​ కోర్సు వివరాలు

aerospace engineering jobs

ఏరోస్పేస్​ ఇంజినీరింగ్​

ఇతర గ్రహాల మీద అడుగుపెట్టడానికి మానవుడి ప్రయత్నం శరవేగంగా జరుగుతోంది. నిత్యం ఏదో ఒక దేశం ఉపగ్రహాలు, స్పేస్​ షటిల్స్​, రోవర్​లను అంతరిక్షంలోకి పంపుతున్నాయి. ఏకంగా అంతరిక్ష పరిశోధన కేంద్రంను ఏర్పాటు చేసుకొని పరిశోధనలు కొనసాగిస్తున్నాయి. దీంతో ఏవియేషన్​ రంగంలో ఎలక్ర్టానిక్స్​, కమ్యూనికేషన్స్​, కంప్యూటర్​ సైన్స్​, ఏరోనాటికల్​, ఆస్ర్టోనాటికల్​ ఇంజినీర్లకు ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తున్నాయి. ముఖ్యంగా ఏరోస్పేస్​ ఇంజినీరింగ్​ చేసినవారికి డిమాండ్​ గణనీయంగా పెరుగుతోంది.

చంద్రునిపై పరిశోధనలకు ఇస్రో ఈ నెల 22న చేపట్టిన చంద్రయాన్​–2 మిషన్​ సక్సెస్​ కావడంతో విద్యార్థులు ఏరోస్పేస్​ ఇంజినీరింగ్​లో ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉండండి అని స్వయంగా హెచ్​ఆర్డీ మినిస్ర్టీ ప్రకటించింది. ఇందుకు గాను స్వయం వెబ్​పోర్టల్​లో ఏరోస్పేస్​ ఇంజినీరింగ్​లో ఆరు ఆన్​లైన్​ కోర్సులు అందిస్తున్నామని పేర్కొంది. ఈ నేపథ్యంలో పథ్యంలో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ కోర్సులు ఉచితంగా ఎలా చదువుకోవాలో తెలుపుతూ ఏఈ రిలేటెడ్​ కోర్సులు, ఆఫర్​ చేస్తున్న సంస్థలు, కెరీర్​ అవకాశాల సమాచారం మీ కోసం..

ఉచితంగా చదువుకోండిలా..

ఏరోస్పేస్ ఇంజినీరింగ్​ చదువుతున్న వారికి హెచ్​ఆర్డీ మినిస్ర్టీ స్వయం, ఎన్​పీటీఈఎల్​ పోర్టల్​లో ఆరు స్పెషలైజ్డ్ సబ్జెక్టులను ఉచితంగా అందిస్తోంది. అవి ఇంట్రడక్షన్​ టు ఏరోస్పేస్​ ఇంజినీరింగ్​ (12 వారాలు), డిజైన్​ ఆఫ్​ ఫిక్స్​డ్​ వింగ్​ అన్​మ్యాన్డ్​ ఏరియల్​ వెహికిల్స్​ (8 వారాలు), ఇంట్రడక్షన్​ టు ఏన్​సెంట్​ ఇండియన్​ టెక్నాలజీ (8 వారాలు), ఇంట్రడక్షన్​ టు రాకెట్​ ప్రొపల్షన్ (12 వారాలు), వైబ్రేషన్ అండ్​ స్ర్టక్చరల్​ డైనమిక్స్​ (8 వారాలు), ఎయిర్​క్రాఫ్ట్​ స్టెబిలిటీ అండ్ కంట్రోల్​ (12 వారాలు). ఈ నెల 29న కోర్సులు ప్రారంభం అవుతాయి. వీటిని ఉచితంగా చదువుకోవచ్చు. సర్టిఫికెట్​ కావాలంటే కోర్సును బట్టి రూ.1000/1500 చెల్లించి సెప్టెంబర్​ లేదా నవంబర్​ లో నిర్వహించే పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. 

ఉన్నత విద్యలో నాణ్యతా ప్రమాణాలు పెంచాలనే ఉద్దేశంతో కేంద్ర మానవ వనరుల శాఖ.. బాంబే, ఢిల్లీ, గువహటి, కాన్పూర్, ఖరగ్‌పూర్, మద్రాస్, రూర్కీ ఐఐటీలు, ఐఐఎస్సీ బెంగళూరు వంటి సంస్థల సహకారంతో  స్వయం (Study Webs of Active –Learning for Young Aspiring Minds), ఎన్‍పీటీఈఎల్‍ (National Programme on Technology Enhanced Learning) వంటి ఆన్​లైన్​ మూక్స్ వెబ్‍సైట్​లను ప్రారంభించింది.

వెబ్‍సైట్స్​: www.swayam.gov.in, www.nptel.ac.in 

ఏరోస్పేస్​ అంటే

ఏరోనాటికల్ అండ్ ఆస్ర్టోనాటికల్ ఇంజినీరింగ్​ల సిలబస్​ కలిసి ఏర్పడిందే ఏరోస్సేస్​ ఇంజినీరింగ్​. ఏరోప్లేన్స్​​, హెలికాప్టర్స్​ అండ్ మిస్సైల్స్‌ వంటి ఎయిర్‌‌క్రాఫ్ట్స్‌కు సంబంధించిన విషయాలు ఏరోనాటికల్​ ఇంజినీరింగ్​ వివరిస్తే.. స్పేస్​ షటిల్స్​, రాకెట్స్ అండ్​ స్పేస్​ స్టేషన్స్ వంటి స్పేస్​ క్రాఫ్ట్స్​ పనితీరును ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌ తెలుపుతుంది. ఏరోనాటికల్​, ఆస్ర్టోనాటికల్ ఇంజినీర్లు ఎయిర్​క్రాఫ్ట్ అండ్ స్పేస్​క్రాఫ్ట్ డిజైనింగ్​, కన్​స్ర్టక్టింగ్, డెవలప్​మెంట్, టెస్టింగ్​, మెయింటెనెన్స్ మరియు రీసెర్చ్​ అండ్​ టెక్నికల్​ అంశాలను డీల్​ చేస్తారు. రాకెట్​/శాటిలైట్స్​ నమూనా తయారీ–వాటి పనితీరు, విడిభాగాలు, యంత్రపరికరాల తయారీ, టెస్టింగ్​ వంటి విధులను ఏరోస్పేస్​ ఇంజినీర్లు నిర్వర్తిస్తారు. 

కోర్సులు

ఏరోస్పేస్​ ఇంజినీరింగ్​ లో ఎయిర్​క్రాఫ్ట్​ మెయింటెనెన్స్​ ఇంజినీరింగ్​, బ్యాచిలర్​ ఆఫ్​ సైన్స్​ ఇన్​ ఎయిర్​క్రాఫ్ట్​ ఇంజినీరింగ్​, బ్యాచిలర్​ ఆఫ్​ ఇంజినీరింగ్​ ఇన్​ ఏరోనాటికల్​ ఇంజినీరింగ్​, మాస్టర్‌‌ ఆఫ్​ సైన్స్​ ఇన్​ ఎయిర్​క్రాఫ్ట్​ ఇంజినీరింగ్​, మాస్టర్​ ఆఫ్​ ఇంజినీరింగ్​ ఇన్​ ఏరోస్పేస్​​ ఇంజినీరింగ్​, మాస్టర్​ ఆఫ్ ఇంజినీరింగ్​ ఇన్​ ఏరోనాటికల్​ ఇంజినీరింగ్, డాక్టర్​ ఆఫ్​ ఫిలాసఫీ ఇన్​ ఏరోనాటికల్​ ఇంజినీరింగ్​, పోస్ట్​ గ్రాడ్యుయేట్​ డిప్లొమా ఇన్​ ఏరోనాటికల్​ ఇంజినీరింగ్​ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటితో తోడు వివిధ సంస్థలు స్పేస్ ఫిజిక్స్, ఆస్ట్రో ఫిజిక్స్, ఆస్ట్రానమీ, స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి వివిధ రకాల పేర్లతో ఏరోస్పేస్​ కోర్సులను అందిస్తున్నాయి.

ఆఫర్ చేస్తున్న సంస్థలు

ఇన్​స్టిట్యూట్​ వెబ్​సైట్​

ఐఐసీటీ, తిరువనంతపురం www.iist.ac.in

ఐఐటీ, మద్రాస్ www.iitm.ac.in

ఐఐటీ, బాంబే www.iitb.ac.in

ఐఐటీ, కాన్పూర్ www.iitk.ac.in

ఐఐఎస్సీ, బెంగళూరు www.iisc.ernet.in 

ఐఐటీ, ఖరగ్‌పూర్‌లు www.iitkgp.ac.in 

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ www.uohyd.ac.in

ఓయూ www.osmania.ac.in 

జేఎన్‌టీయూహెచ్​ www.jntuh.ac.in 

ఆంధ్రా యూనివర్సిటీ www.andhrauniversity.edu.in
జేఎన్‌టీయూ, కాకినాడ www.jntk.edu.in

అర్హతలు

మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల కాంబినేషన్​తో ఇంటర్​ లేదా తత్సమాన ఉత్తీర్ణత కలిగిన వారు ఈ కోర్సులకు అర్హులు. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో జేఈఈ మెయిన్​, అడ్వాన్స్​డ్​ పరీక్షల ద్వారా ప్రవేశం కల్పిస్తుండగా రాష్ర్టాల్లోని ఇంజినీరింగ్ ఇన్​స్టిట్యూట్​లు సొంతంగా ఎంట్రన్స్​ టెస్ట్​లు నిర్వహించుకుంటున్నాయి. మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టుల్లో కమాండ్​ ఉన్న వారికి సరిగ్గా సరిపోయే బ్రాంచ్​ ఏరోస్పేస్​ ఇంజినీరింగ్​. టెక్నికల్​, మెకానికల్​ నాలెడ్జ్ ఉంటే సులువుగా రాణించవచ్చు.

కరిక్యులమ్​

ఈ కోర్సులో ప్రధానంగా ఎయిర్​క్రాఫ్ట్స్​, స్పేస్​క్రాఫ్ట్స్​ డిజైనింగ్​, తయారీ, మెయింటెనెన్స్ వంటి అంశాలను బోధిస్తారు. ఇంట్రడక్షన్​  టు ఏరోస్పేస్​ ఇంజినీరింగ్, ఏరోడైనమిక్స్, ఏరోస్పేస్​ ప్రొపల్షన్​, ఏరోస్పేస్​ స్ర్టక్చరల్​ మెషిన్స్​, ఎయిర్​క్రాఫ్ట్​ డిజైన్​, ఎయిర్​క్రాఫ్ట్​ ప్రొపల్షన్​, ఫ్లైట్​ మెకానిక్స్​, ఇన్​కంప్రెషబుల్​ ఫ్లూయిడ్​ మెకానిక్స్​, స్పేస్​ ఫ్లైట్​మెకానిక్స్​, థర్మోడైనమిక్స్​ అండ్​ ప్రొపల్షన్​, సాలిడ్ మెకానిక్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్‌, థియరీ ఆఫ్ మెషిన్స్, ఏరోస్పేస్ స్ట్రక్చర్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్, ప్రొడక్షన్ టెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీ, ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్, కాంపోజిట్ అండ్ ఎయిర్‌క్రాఫ్ట్ మెటీరియల్స్, ఆర్బిటాల్ మెకానిక్స్, గెడైన్స్ అండ్ కంట్రోల్ వంటి అంశాలను టీచ్ చేస్తారు. వీటికి తోడు మ్యాథమెటిక్స్, ఇంజినీరింగ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెకానిక్స్‌ను చదవాల్సి ఉంటుంది.

స్పెషలైజేషన్లు

స్పేస్ సైన్స్​లో బ్యాచిలర్​ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఎంఈ, ఎంటెక్, ఎంఎస్​, ఎంఎస్సీలో పదుల సంఖ్యలో స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. వీటి అనంతరం పీహెచ్​డీ కూడా చేసే అవకాశం ఉంది.

  • ఆస్ట్రానమీ
  • ఆస్ట్రోఫిజిక్స్
  • గెలాక్టిక్ సైన్స్
  • స్టెల్లర్ సైన్స్
  • స్పేస్ డిఫెన్స్
  • స్పేస్ కొలనైజేషన్
  • అట్మాస్ఫియరిక్ సెన్సైస్
  • శాటిలైట్ కమ్యూనికేషన్స్ 
  • జీఐఎస్
  • శాటిలైట్ మెటియొరాలజీ

ఆపర్చునిటీస్​ ఇలా

ఏవియేషన్​, స్పేస్​ అండ్​ డిఫెన్స్ రంగాల్లోని దాదాపు 100కు పైగా సంస్థల్లో ఏరోస్సేస్​ ఇంజినీరింగ్​ నిపుణులకు ఉద్యోగాలు లభిస్తాయి.​ అంతరిక్ష పరిశోధన, రాకెట్ ప్రయోగ కేంద్రాలైన ఇస్రో, షార్, డీఆర్‌డీవో, హెచ్​ఏఎల్​, బీఈఎల్​, బీహెచ్​ఈఎల్​ వంటి స్టేట్ ఓన్డ్​ కంపెనీల్లో జాబ్​లు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఎయిర్‌బస్, బోయింగ్, నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, హోనీవెల్, రాక్ వెల్ కోలీన్స్ వంటి విదేశీ అంతరిక్ష రంగ పరిశోధన సంస్థల్లోనూ ఉద్యోగాలు పొందవచ్చు. ఇటీవల నిర్వహించిన చద్రయాన్​–2 వంటి మరెన్నో ప్రయోగాలను ఇస్రో, నాసా వంటి అంతరిక్ష సంస్థలు చేపట్టనుండటంతో అవకాశాలు పుష్కలంగా లభిస్తున్నాయి. వీటికి తోడు ప్రైవేటు కంపెనీలు సైతం అంతరిక్ష పరిశోధనలు, ప్రయోగాలు చేస్తున్నాయి. ప్లానెటోరియంలు, అబ్జర్వేటరీ, స్పేస్ రీసెర్చ్ ఏజెన్సీలు కూడా ఏరోస్పేస్​ గ్రాడ్యుయేట్లను నియమించుకుంటున్నాయి.

టాప్​ రిక్రూటర్స్​

విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్

ఇస్రో శాటిలైట్ సెంటర్

స్పేస్ అప్లికేషన్ సెంటర్

నేషనల్ ఏరోస్పేస్ లేబొరేటరీస్

షార్

మిధానీ​

డీర్‌డీఓ

లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్

ఇస్రో శాటిలైట్ ట్రాకింగ్ సెంటర్

హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్

ఏరోస్పేస్ సిస్టమ్స్ ఇండస్ర్టీస్​

అట్రాక్టివ్​ శాలరీస్​

ఏవియేషన్​, స్పేస్​ రంగాల్లో ఇంజినీర్​ లేదా శాస్ర్తవేత్తగా కెరీర్​ ప్రారంభించవచ్చు. ఎంట్రీ లెవెల్లో పనిచేసే ప్రదేశాన్ని బట్టి 40 వేల నుంచి 60 వేల వేతనం లభిస్తుంది. కేంద్ర ప్రభుత్వం అందించే ఇతర అన్ని అలవెన్సులుంటాయి. ఆఫీస్​ పనివేళలు కూడా అనుకూలంగా ఉంటాయి. పీజీ, పీహెచ్​డీ లో స్పెషలైజేషన్లు కలిగి ఉంటే యావరేజ్ ప్యాకేజీ 14 లక్షలకు పైగా ఉంటుంది.

జాబ్​ ప్రొఫైల్స్​

కన్సల్టెంట్స్​

ఎయిర్​క్రాఫ్ట్​ ఇంజినీర్​

థర్మల్​ డిజైన్​ ఇంజినీర్​/మేనేజర్​​

మెకానికల్​ డిజైన్​ ఇంజినీర్స్

ఏరోస్పేస్​ టెక్నాలజిస్ట్​

ఎయిర్​క్రాఫ్ట్​ ప్రొడక్షన్​ మేనేజర్​

అసిస్టెంట్ టెక్నికల్​ ఆఫీసర్స్

ఏరోస్పేస్​ డిజైన్​ చెకర్

గ్రాడ్యుయేట్​ ఇంజినీర్​ ట్రైనీస్​

అసిస్టెంట్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజనీర్

థర్మల్ డిజైన్ మేనేజర్

ఆస్ట్రోనాట్స్

Leave a Comment