విద్యార్థుల్లో ఇంజినీరింగ్ నైపుణ్యాలను డెవలప్ చేస్తూ ఇండస్ర్టీ రెడీగా మారుస్తుంది సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (సీఐటీడీ). డిజైనింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో టూల్స్, డైస్, మౌల్డ్స్ అవసరాన్ని గుర్తించి షార్ట్‌టెర్మ్, లాంగ్‌టెర్మ్‌లో టెక్నికల్ ట్రైనింగ్ అందిస్తోంది. కాలేజీకి, ఇండస్ర్టీకి మధ్యలో ఉండే స్కిల్ గ్యాప్‌ను వందశాతం ఫిల్ చేస్తూ జాబ్ రెడీ అభ్యర్థులను తయారు చేస్తుంది. ‘‘క్రియేట్ స్కిల్స్.. క్రియేట్స్ ఎంప్లాయీస్, క్రియేట్ ఎంట్రప్రెన్యూర్స్..’’ అనే మోటో తో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ర్టీలో టూల్ డిజైనర్ల కొరతను తీరుస్తూ వంద శాతం ప్లేస్‌మెంట్స్‌తో లక్షల మందిని నిపుణులుగా మారుస్తున్న సీఐటీడీ గతేడాదే 50 సంవత్సరాలు పూర్తిచేసుకుంది.
ఇంజినీరింగ్ అండ్ టెక్నికల్ విభాగంలో ట్రైనింగ్ ఇస్తున్న సీఐటీడీలో డిప్లొమా, ఎంఈ, ఎంటెక్ వంటి లాంగ్‌టెర్మ్ కోర్సులు, క్యాడ్/క్యామ్, ఎలక్ర్టానిక్ సిస్టం డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ (ఈఎస్‌డీఎం), ఆటోమేషన్‌లో ఏడాదిలోపు వ్యవధి గల షార్ట్‌టెర్మ్/సర్టిఫికెట్ ప్రోగ్రాములు అందుబాటులో ఉన్నాయి. సర్టిఫికెట్ కోర్సులు ఎస్సీ/ఎస్టీలకు ఉచితం కాగా, ఇతరులకు ఫీజు ఉంటుంది. డిప్లొమా, పీజీ కోర్సుల్లోనూ మార్కెట్ కంటే తక్కు ఫీజులతోనే ట్రైనింగ్ ఇస్తున్నారు. ప్రభుత్వం నుంచి అర్హులైన వారికి ఫీజు రీఇంబర్స్‌మెంట్ అందిస్తారు. హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. డిప్లొమా, ఎంఈ/ఎంటెక్ చదివిన వారు రెగ్యులర్ స్టూడెంట్స్ లాగే ఉన్నత చదువులకు వెళ్లవచ్చు. అన్ని రకాల అర్హత, పోటీ పరీక్షలు రాయవచ్చు.
ఎస్సీ, ఎస్టీలకు ఉచితం
ఏడాదిలోపు వ్యవధితో ఉండే షార్ట్‌టెర్మ్/సర్టిఫికెట్ కోర్సులతోనే అధికమంది ఉపాధి పొందుతున్నారు. ఇవి ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్‌కు ఉచితం. రిజిస్ర్టేషన్ ఫీజు రూ.వెయ్యి మాత్రమే చెల్లించాలి. ఇతర కేటగిరీల వారు కోర్సు ఫీజు ఉంటుంది. ఈ విభాగంలో క్యాడ్/క్యామ్, వీఎల్ఎస్ఐ, ఆటోమేషన్ లో దాదాపు 35 సర్టిఫికెట్ ప్రోగ్రాములు అందుబాటులో ఉన్నాయి. ప్రతి నెలా మొదటి, మూడో బుధవారం ఈ కోర్సులు ప్రారంభమవుతాయి. సీఐటీడీ సెంటర్లో నేరుగా అడ్మిషన్ పొందొచ్చు. ఇవే కోర్సులు బయట లభిస్తాయి. కానీ నిపుణులైన ఫ్యాకల్టీ, అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్‌తో ల్యాబోరేటరీ సదుపాయాలు ఇక్కడ మాత్రమే ఉంటాయి. పెద్ద పెద్ద ఇండస్ర్టీల్లో వాడే హెవీ మెషినరీ ఇక్కడ ఉంది. వీటిని ఆపరేట్ చేయగలిగిన వారు కంపెనీలో చేరిన మొదటి రోజు నుంచే పని చేయగల స్కిల్ సొంతం చేసుకుంటారు.
కోర్సు వ్యవధి అర్హత
క్యాడ్/క్యామ్
అడ్వాన్స్ సర్టిఫికెట్ కోర్స్ ఇన్ సీఎన్‌సీ మెషినింగ్ ఏడాది ఐటీఐ
మాస్టర్ సర్టిఫికెట్ కోర్స్ ఇన్ కంప్యూటర్ ఎయిడెడ్ టూల్ ఇంజినీరింగ్ ఆరు నెలలు డిప్లొమా/బీఈ/బీటెక్ (మెకానికల్)
మాస్టర్ సర్టిఫికెట్ కోర్స్ ఇన్ క్యాడ్/క్యామ్ ఆరు నెలలు డిప్లొమా/బీఈ/బీటెక్ (మెకానికల్)
సర్టిఫికెట్ కోర్స్ ఇన్ సీఎన్‌సీ మిల్లింగ్ ఆరు నెలలు పదోతరగతి/తత్సమానం
సర్టిఫికెట్ కోర్స్ ఇన్ సీఎన్‌సీ టర్నింగ్ ఆరు నెలలు పదోతరగతి/తత్సమానం
మెకానికల్ క్యాడ్/క్యామ్ నాలుగు నెలలు డిప్లొమా/బీఈ/బీటెక్ (మెకానికల్)
ఇంటిగ్రేటెడ్ హైపర్‌మెష్ మూడు నెలలు డిప్లొమా/బీఈ/బీటెక్ (మెకానికల్)
కంప్యూటర్ ఎయిడెడ్ ఇంజినీరింగ్ మూడు నెలలు డిప్లొమా/బీఈ/బీటెక్ (మెకానికల్)
ఆటోమేషన్
మాస్టర్ సర్టిఫికెట్ కోర్స్ ఇన్ మెకట్రానిక్స్ ఆరు నెలలు డిప్లొమా/బీఈ/బీటెక్
ఇండస్ర్టియల్ రోబోటిక్స్ రెండు నెలలు డిప్లొమా/బీఈ/బీటెక్
పీఎల్‌సీ ప్రోగ్రామింగ్ 96 గంటలు డిప్లొమా/బీఈ/బీటెక్
మెకట్రానిక్స్ 96 గంటలు డిప్లొమా/బీఈ/బీటెక్
పవర్ ఎలక్ర్టానిక్స్ 96 గంటలు డిప్లొమా/బీఈ/బీటెక్
వీఎల్‌ఎస్ఐ & ఎంబెడ్డెడ్ సిస్టమ్స్
అడ్వాన్స్‌డ్ ఎంబెడ్డెడ్ టెక్నాలజీ ఆరు నెలలు డిప్లొమా/బీఈ/బీటెక్/బీఎస్సీ/ఎంఎస్సీ
అడ్వాన్స్‌డ్ డిజిటల్ డిజైన్ ఆరు నెలలు డిప్లొమా/బీఈ/బీటెక్/బీఎస్సీ/ఎంఎస్సీ
ఎంబెడ్డెడ్ సిస్టమ్స్ 96 గంటలు టెన్త్/డిప్లొమా/డిగ్రీ (ఎలక్ట్రానిక్స్)
వీఎల్ఎస్ఐ 96 గంటలు టెన్త్/డిప్లొమా/డిగ్రీ (ఎలక్ట్రానిక్స్)
మ్యాట్‌ల్యాబ్ 96 గంటలు టెన్త్/డిప్లొమా/డిగ్రీ (ఎలక్ట్రానిక్స్)
సామ్‌సంగ్‌తో స్వయం ఉపాధి
సామ్‌సంగ్ టెక్నికల్ స్కూల్ పేరుతో ఐటీఐ మొదలుకొని పీజీ గ్రాడ్యుయేట్ల వరకు ప్రత్యేకంగా 5 రకాల సర్టిఫికెట్ కోర్సులను సీఐటీడీ ఆఫర్ చేస్తోంది. వీటన్నింటిలో ఎస్సీ/ఎస్టీలకు రిజిస్ర్టేషన్ ఫీజు మినహా ఉచితంగానే ట్రైనింగ్ ఇస్తారు. ఎస్సీ/ఎస్టీలతో పాటు ఎంబీసీ కి చెందిన బాలికలకు ఉచిత హాస్టల్ వసతి కల్పిస్తారు. విజయవంతంగా ట్రైనింగ్ పూర్తి చేసుకున్నవారికి ఫ్రీ టూల్ కిట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మహిళలు, దివ్యాంగులు, దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న వారికి సామ్‌సంగ్ స్కాలర్‌షిప్‌తో పాటు టాపర్స్ కు అవార్డులు అంచేస్తుంది. ప్రాక్టికల్ ట్రైనింగ్‌తో పాటు సామ్‌సంగ్ సర్వీస్ సెంటర్లలో ఆన్ జాబ్ ట్రైనింగ్, ఆపైన ప్లేస్‌మెంట్స్ ఉంటుంది. ప్రతి నెలా మొదటి, మూడో బుధవారం ఈ కోర్సులు ప్రారంభమవుతాయి. ఎవరైనా సీఐటీడీలో నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆడియో-వీడియో (ఏవీ): ఇది మూడు నెలల సర్టిఫికెట్ కోర్సు. ఇందులో ఎల్ఈడీ, ఎల్‌సీడీ, ప్లాస్మా టీవీ, హోం థియేటర్, డీవీడీ బ్లూ రే ప్లేయర్స్ వంటి ఎలక్ర్టానిక్స్ పరికరాలను ఎలా రిపేర్ చేయాలో నేర్పిస్తారు. ఐటీఐ/ఇంటర్/డిప్లొమా/డిగ్రీ చదివిన వారు అర్హులు.
హెచ్‌హెచ్‌పీ: హ్యాండ్ హెల్డ్ ఫోన్స్ గా పిలిచే ఈ కోర్సులో బేసిక్ ఫోన్స్ మొదలుకొని స్మార్ట్ ఫోన్స్, టాబ్లె్ట్స్ వరకు రిపేరింగ్ అండ్ సర్వీసింగ్‌లో 3 నెలలపాటు శిక్షణ ఇస్తారు. ఐటీఐ ఆ పైన చదివిన వారెవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆర్ఏసీహెచ్‌ఏ: ఐటీఐ ఆ పైన చదివిన వారెవరైనా అర్హులే. ఇందులో రిఫ్రిజరేటర్లు, ఏసీలు, వాషింగ్ మెషీన్లు, మైక్రోవేవ్ ఓవెన్స్ వంటి వాటి సర్వీసింగ్‌తో పాటు రిపేరింగ్‌లో నాలుగు నెలల ట్రైనింగ్ ఇస్తారు.
సీఏటీఈ: మాస్టర్ సర్టిఫికెట్ కోర్స్ ఇన్ కంప్యూటర్ ఎయిడెడ్ టూల్ ఇంజినీరింగ్ (ఎంసీసీసీఏఈ) గా పిలిచే ఈ కోర్సుకు డిప్లొమా/బీఈ/బీటెక్ విద్యార్థులు అర్హులు. 6 నెలల పాటు కంప్యూటర్ ఎయిడెడ్ టూల్ డిజైనింగ్‌లో ట్రైనింగ్ ఇస్తారు.
ఎంసీసీసీ: మాస్టర్ సర్టిఫికెట్ కోర్స్ ఇన్ క్యాడ్/క్యామ్ ఆరు నెలల కోర్సు. డిప్లొమా/బీఈ/బీటెక్ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
లాంగ్‌టెర్మ్ కోర్సులు
ఇందులో డిప్లొమా ఇన్ టూల్, డై అండ్ మౌల్డ్ మేకింగ్ (డీటీడీఎం) , డిప్లొమా ఇన్ ఎలక్ర్టానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్(డీఈసీఈ), డిప్లొమా ఇన్ ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ ఇంజినీరింగ్ (డీఏఆర్ఈ), డిప్లొమా ఇన్ ప్రొడక్షన్ ఇంజినీరింగ్ (డీపీఈ) అనే రకాల డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో డీటీడీఎం, డీఈసీఈ కి కనీసం 45 శాతం మార్కులతో పదోతరగతి ఉత్తీర్ణత, మిగిలిన వాటికి టెన్త్ పాసయితే చాలు. డీటీడీఎం నాలుగేళ్ల కోర్సు కాగా మిగిలినవి మూడేళ్ల వ్యవధి గలవి. ఒక్కో బ్రాంచ్‌లో 60 సీట్లున్నాయి. సీఐటీడీ నిర్వహించే ప్రత్యేక ప్రవేశ పరీక్ష (ఉస్మానియా యూనివర్శిటీ) ద్వారా ప్రవేశం కల్పిస్తారు. ఇందులో ఉత్తీర్ణులైన వారికి స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ నుంచి సర్టిఫికెట్ ప్రదానం చేస్తారు. కోర్సు తర్వాత ఉద్యోగంలో చేరొచ్చు లేదంటే లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్ చేసే అవకాశం ఉంది. డిప్లొమా ఎలిజిబిలిటీతో ఉండే అన్ని రకాల పోటీ, అర్హత పరీక్షలు రాయవచ్చు.
పీజీ కోర్సుల్లో రెండేళ్ల వ్యవధి గల ఎంఈ మెకానికల్ క్యాడ్/క్యామ్ (ఎంఈసీసీ), ఎంఈ టూల్ డిజైన్ (ఎంఈటీడీ), ఎంఈ డిజైన్ ఫర్ మ్యానుఫ్యాక్చర్ (ఎంఈడీఎఫ్ఎం) కోర్సులున్నాయి. సంబధిత బ్రాంచ్‌లో కనీసం 55 శాతం మార్కులతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత సాధించాలి. ఎంట్రన్స్ ద్వారా ప్రవేశం ఉంటుంది. ఒక్కో ప్రోగ్రాములో 32 సీట్లున్నాయి. ఎంఈ కోర్సులు పూర్తి చేసుకున్న వారికి ఉస్మానియా యూనివర్శిటీ నుంచి సర్టిఫికెట్లు ప్రదానం చేస్తారు. డిప్లొమా, పీజీ కోర్సులకు దరఖాస్తు తేదీలు ముగిశాయి.
ఆగస్టులో ఎంటెక్ మెకట్రానిక్స్
ఎంటెక్ మెకట్రానిక్స్ కోర్సుకు ఆగస్టులో ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తారు. దీనికి బీటెక్ గ్రాడ్యుయేట్లు అర్హులు. ఎలక్ర్టానిక్స్, మెకానికల్ ఇంజినీరింగ్ సిస్టమ్స్‌లోని రోబోటిక్స్, ఎలక్ర్టానిక్స్, కంప్యూటర్ సిస్టమ్స్, కంట్రోల్ అండ్ ప్రోడక్ట్ ఇంజినీరింగ్, టెలికమ్యూనికేషన్స్ టాపిక్‌ల్లో టీచింగ్, ట్రైనింగ్ ఉంటుంది. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి జేఎన్టీయూ–హైదరాబాద్ నుంచి సర్టిఫికెట్ ప్రదానం చేస్తారు.
ప్లేస్‌మెంట్స్.. బ్యాంక్ లోన్స్
ట్రైనింగ్ పూర్తి చేసిన వారి కోసం ప్రతి వారం జాబ్ మేళాలు నిర్వహిస్తారు. సీఐటీడీ అభ్యర్థులను ఆయా కంపెనీలకు రెఫర్ చేస్తుంది. దాదాపు వందశాతం మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఎక్కువగా సర్టిఫికెట్ కోర్సులు చేసిన వారు త్వరగా ప్లేస్మెంట్ పొందుతున్నారు. ఉద్యోగం వద్దనుకునే వారు సొంతంగా యూనిట్‌లు నెలకొల్పవచ్చు. ఇందుకు సీఐటీడీ బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకొని లోన్ సదుపాయాన్ని కల్పిస్తోంది. బాలానగర్‌లోని దాదాపు సగానికి పైగా ఇండస్ర్టీలు ఇక్కడ శిక్షణ తీసుకున్న వారే స్థాపించడం.. అవి ప్రస్తుతం కోట్ల టర్నోవర్‌తో వేల మందికి ఉపాధి కల్పించడం గర్వంగా ఉందని చెబుతున్నారు సీఐటీడీ డిప్యూటీ డైరెక్టర్ సుగ్యాన్ రంజన్ దలాయ్.
టాప్ రిక్రూటర్స్
ఎం అండ్ ఎం
హ్యూందాయ్
బజాజ్ ఆటో
క్వెస్ట్ గ్లోబల్
సామ్‌సంగ్
జాన్ డీరె
సీమెన్స్
గోద్రెజ్
ఉషా ఇంటర్నేషనల్
ఇసుజు
ఏసీఎస్
వాల్కో ఇండియా
ఈ ఇన్‌స్టిట్యూట్ చాలా డిఫరెంట్. 25 శాతం థియరీ, 75 శాతం ప్రాక్టికల్ పై ఫోకస్ చేస్తూ క్రమశిక్షణతో కూడిన ట్రైనింగ్ అందిచడం దీని ప్రత్యేకత. ల్యాబ్‌లో అన్ని రకాల మెషినరీ, సదుపాయాలున్నాయి. వాటిని విద్యార్థులే ఆపరేట్ చేసేలా ట్రైన్ చేస్తాము. బయటి కాలేజీల్లో మెషినరీ, ల్యాబ్ సదుపాయాలుండవు. టాప్ కంపెనీలు రెగ్యులర్‌గా రిక్రూట్‌మెంట్స్ జరుపుతాయి. సొంతంగా యూనిట్‌లు నెలకొల్పేవారికి లోన్ సదుపాయం కూడా ఉంది.
సుగ్యాన్ రంజన్ దలాయ్
డిప్యూటీ డైరెక్టర్, సీఐటీడీ
సీఐటీడీ గురించి..
టూల్స్, డైస్, మౌల్డ్స్ డిజైనింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం 1968లో మొట్టమొదటిసారి హైదరాబాద్‌లోని బాలనగర్‌లో సెల్ఫ్ ఫైనాన్స విధానంలో సీఐటీడీ ఏర్పాటు చేశారు. దీనిని యూనైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్, అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌వో) సంయుక్తంగా ప్రారంభించాయి. ప్రస్తుతం సీఐటీడీకి దేశవ్యాప్తంగా మొత్తం 18 టూల్ రూమ్స్ ఉన్నాయి.