indiramma indlu final list: ఇందిరమ్మ ఇండ్ల ఫైనల్​ లిస్టు ఇదే..

indiramma indlu status

తెలంగాణ ప్రభుత్వం జనవరి 26వ తేదీన ప్రారంభించిన ప్రతిష్టాత్మక పథకాల్లో ఇందిరమ్మ ఇండ్లు ఒకటి. ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల జాబితాను జనవరి 21 నుంచి జనవరి 24వరకు నిర్వహించిన గ్రామ సభల్లో చదివి వినిపించారు. అయితే ఈ జాబితానే ఫైనలా? లేక మరో జాబితా ఉంటుందా? ఫైనల్​ జాబితాలో వచ్చిన పేర్లను ఏవైనా తొలగిస్తారా? వీటిపై అనేక సందేహాలు ప్రజల్లో ఉన్నాయి.

సర్వే జాబితాలో మీ పేరు తెలుసుకోవడానికి కింది లింక్​ క్లిక్​ చేయండి.

https://indirammaindlu.telangana.gov.in

అయితే తాజాగా ప్రభుత్వం నుంచి వచ్చిన సమాచారం మేరకు ప్రభుత్వ హౌజింగ్​ కార్పొరేషన్​ అధికారులు నిర్వహించిన సమావేశంలో ఇందిరమ్మ ఇండ్ల ఫైనల్​ లిస్టు పై రివ్యూ నిర్వహించారు.

ఇందిరమ్మ ఇండ్ల ఫైనల్​ లిస్టును L1, L2, L3 జాబితాలుగా విభజించారు. వీటిలో ఎల్​1 అనగా లబ్దిదారులు ఖాళీ ఇంటి స్థలం ఉండి పూర్తిగా ఇళ్లు లేని వారు, ఎల్​2 అనగా ఇండ్లు గానీ ఖాళీ స్థలం గానే లేనివారు, ఎల్​3 అనగా పూరిల్లు, రేకులు, శిథిలావస్థలో ఉన్న పెంకుటిల్లు కలవారుగా విభజించారు.

గ్రామ సభలో ప్రకటించిన ఫైనల్​ లిస్టులోని లబ్దిదారుల్లో ఎల్​1 కేటగిరి వారికి మొదటి విడుతగా ఇల్లు నిర్మాణానికి సంబంధించిన నిధులు విడుదల చేస్తారు. ఆ తర్వాత ప్రాధాన్యత వారిగా ఎల్​1, ఎల్​2, ఎల్​3 కేటగిరీలకు ఇందిరమ్మ ఇండ్ల డబ్బులు చెల్లిస్తారు. దీనిపై మరికొంత క్లారిటీ రావాల్సి ఉంది.

1 thought on “indiramma indlu final list: ఇందిరమ్మ ఇండ్ల ఫైనల్​ లిస్టు ఇదే..”

  1. L2. అనగా ఇండ్లు,స్థలం. ఏవి లేని వారికి. కరెక్టుగా సర్వే చేసి వీరికి త్వరగా (జాగ,స్థలం)చూపించి ఇండ్లు కట్టించి ఇవ్వాలి .మేము ఇంటి కిరాయలు కట్టలేక పోతున్నాం.sir.. పిల్లల చదువు,ఇన్టిఖర్చులు.వెళ్ళలుకపోతున్నాయి.కాబట్టి.మాకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి sir C.M. సారు..నాది గోదావరిఖని,రామగుండం.7801009163,

    Reply

Leave a Comment